Sat Dec 06 2025 07:49:00 GMT+0000 (Coordinated Universal Time)
TDP : జోగి ప్రయత్నాలు విఫలమయ్యాయి.. గెలుపు మాదే
ఓటర్లను భయపెట్టి జోగి రమేష్ గెలవాలని చేసిన ప్రయత్నం విఫలమైందని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు

అక్రమాలు చేసి, టీడీపీ ఓటర్లను భయపెట్టి జోగి రమేష్ గెలవాలని చేసిన ప్రయత్నం విఫలమైందని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలపై జోగి రమేష్, అతని అనుచరులు దుర్భాషలు ఆడారన్నారు. జోగి రమేష్ పై తాను ఎప్పుడైనా నోరు జారానా అని బోడె ప్రసాద్ ప్రశ్నించారు.
ఎన్ని అరాచకాలు చేసినా....
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తపై దాడులు చేశారని బోడె ప్రసాద్ అన్నారు. పోరంకిలో దొంగఓట్లతో హల్చల్ చేయాలని జోగి రమేష్ ప్రయత్నించారన్నారు. జోగి ప్రయత్నాలను టీడీపీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టారన్న బోడె ప్రసాద్ పొరంకి బూత్లో జోగి, పెనమలూరు సీఐ టీడీపీకి పడాల్సిన కొన్ని ఓట్లు పడకుండా నష్టం కలిగించారని అన్నారు.
Next Story

