Thu Mar 19 2026 05:26:51 GMT+0530 (India Standard Time)
Pemmasani : కేంద్ర మంత్రి పెమ్మసానిని కలుసుకోవాలంటే సమయాలు ఇవే
నేడు గుంటూరులో కేంద్ర మంత్రి పర్యటన పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు

నేడు గుంటూరులో కేంద్ర మంత్రి పర్యటన పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఆయన ఈరోజు, రేపు గుంటూరు పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులపై అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
రేపు కూడా పర్యటన...
తరువాత తన స్వగ్రామమైనన బుర్రిపాలెం వెళతారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని మంత్రి కార్యాలయం వర్గాలు తెలిపారు.
Next Story

