Thu Mar 12 2026 20:31:36 GMT+0530 (India Standard Time)
రాష్ట్రంపై జగన్ కక్ష కట్టారు : పయ్యావుల
జగన్.. రాష్ట్రంపైనా, ప్రజలపైనా కక్ష కట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు

జగన్.. రాష్ట్రంపైనా, ప్రజలపైనా కక్ష కట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అధికారం పోయిందనే బాధతో కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు.అప్పులు ఇచ్చేవారిని కూడా జగన్ బెదిరిస్తున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు. రుణాల విషయంలో ఉన్నతాధికారులను కూడా జగన్ బెదిరిస్తున్నారని,వైసీపీ పాలనలోని లోపాలను మీకే చెప్పామని పయ్యావుల కేశవ్ తెలిపారు. గతంలో చెప్పిన అబద్ధాలనే జగన్ మళ్లీ ప్రెస్మీట్లో చెప్పారని, వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందని పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఆర్థిక విధ్వంసాన్ని...
వైసీపీ పాలనలో చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఇచ్చినట్లు గతంలో కాగ్ ఎన్నడూ నివేదిక ఇవ్వలేదని : పయ్యావుల కేశవ్ అన్నారు. 48 వేల కోట్ల రూపాయలు ఎంట్రీలు బ్యాక్ఎండ్లో సీఎఫ్ఎంఎస్లో ఎంట్రీ అయ్యాయని చెప్పిందని పయ్యావుల కేశవ్ అన్నారు. రూ.9.74 లక్షల కోట్ల బకాయిలు వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిందని, మరో పదేళ్ల పాటు ఈ ఆర్థిక భారం తప్పదని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
Next Story

