Pawan Kalyan : ఉప్పాడ మత్స్యకారులకు పవన్ హామీలు ఇవే
ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు

ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోనని, మీ వద్దనే ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మరొకవైపు పవన్ కల్యాణ్ ఉప్పాడ తీరంలో కాలుష్యంపై కూడా ఎక్స్ లో స్పందించారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో నా మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నానన్నారు. ప్రధానంగా తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలను పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ₹90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది.

