Fri Dec 05 2025 22:49:38 GMT+0000 (Coordinated Universal Time)
వేలేరులో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం
కలపర్రు నుంచి పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి వెళ్లి అక్కడ రచ్చబండ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం జనసేన

గన్నవరం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వేలేరు వెళ్లారు. వేలేరుకు వచ్చిన పవన్ కు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. పవన్ పై పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి ఏలూరుకు వెళ్లిన పవన్ కు.. కలపర్రు వద్ద జనసేన కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.
కలపర్రు నుంచి పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి వెళ్లి అక్కడ రచ్చబండ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం జనసేన రైతు భరోసా యాత్రలో భాగంగా.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. రైతు భరోసా యాత్రలో ఇప్పటి వరకూ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన పలు రైతుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.
Next Story

