Wed Mar 11 2026 13:25:14 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు సచివాలయానికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు సచివాలయానికి రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు సచివాలయానికి రానున్నారు. ఉదయం 8.30 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి పవన్ కల్యాణ్ సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 9.15 గంటలకు అధికారులతో పవన్ కల్యాన్ సమావేశం కానున్నారు. తన శాఖకు చెందిన అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష చేయనున్నాు.
అధికారులతో సమీక్ష...
అలాగే అధికారులతో సమావేశంతో పాటు మరికొన్ని సమావేశాల్లోనూ పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ప్రధానంగా గ్రామీణ రహదారులు, మంచినీటి సరఫరా, విద్యుత్తు వంటి అంశాలపై పవన్ కల్యాణ్ అధికారులతో చర్చించే అవకాశముంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఉండి తిరిగి పవన్ కల్యాణ్ సచివాలయం నుంచి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
Next Story

