Thu Mar 19 2026 13:28:52 GMT+0530 (India Standard Time)
నేడు కోనసీమ జిల్లాకు పవన్
జనసేన అధినేత నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు

జనసేన అధినేత నేడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం అందచేయనున్నారు. కోనసీమ జిల్లాలోని 67 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారు. మండపేటలో ఆయన పర్యటించనున్నారు.
బహిరంగ సభ...
కౌలు రైతు భరోసా పేరిట రాష్ట్రమంతటా పర్యటిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ భరోసా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు మండపేటలో రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
Next Story

