Mon Jan 20 2025 15:31:40 GMT+0000 (Coordinated Universal Time)
19న పర్చూరులో పవన్ కల్యాణ్
ఈ నెల 19వ తేదీన బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు
![pawan kalyan, nadendla manohar, janasena, parchuru pawan kalyan, nadendla manohar, janasena, parchuru](https://www.telugupost.com/h-upload/2022/02/26/1329707-pawan-kalyan-nadendla-manohar-janasena-parchuru.webp)
ఈ నెల 19వ తేదీన బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 19వ తేదీన పర్చూరు నుంచి కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 76 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించి వారికి లక్ష రూపాయలు అందచేస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
సీఎంకు పట్టదు...
సాగుకోసం కౌలు రైతులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి గుర్తించలేకపోతున్నారన్నారు. రైతు భరోసా కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, ప్రభుత్వం మాత్రం తాను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి కూడా ఇప్పటి వరకూ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అగ్రకులాలని చెప్పి వారికి రైతు భరోసా ఇవ్వడం లేదని నాదెండ్ల ఆక్షేపించారు.
Next Story