Sun Mar 08 2026 00:50:15 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలో కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉపముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే.
పంచాయతీ రాజ్ శాఖతో పాటు...
కీలకమైన పంచాయతీ రాజ్ శాఖతో పాటు మానవవనరుల అభివృద్ధి శాఖను కూడా పవన్ కల్యాణ్ చేపట్టనున్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారి సౌకర్యాలపై దృష్టిపెట్టడానికి తనకు ఈ శాఖ అంటే ఇష్టమని ఆయన గతంలో చెప్పారు. ఆయన ఆశించిన విధంగానే అనుకున్న శాఖలు దక్కడంతో నేడు పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. తొలి సంతకం ఆయన దేనిపై చేయనున్నారన్నది తెలియాల్సి ఉంది.
Next Story

