Sun Mar 08 2026 11:21:47 GMT+0530 (India Standard Time)
ఇప్పటం గ్రామస్థులకు నేడు పవన్ సాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల నగదు సాయాన్ని అందించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల నగదు సాయాన్ని అందించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి పవన్ ఆర్థిక సాయం చేస్తారు.
రోడ్డు విస్తరణ పేరుతో...
ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో కొన్ని ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేయడంతో పవన్ కల్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున సాయం ఇస్తానని ప్రకటించారు. తన ప్రకటన మేరకు ఆయన ఈ సాయం చేయనున్నారు.
Next Story

