Fri Dec 05 2025 11:36:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇడుపులపాయ పైన హైవే వేస్తా... పవన్ వార్నింగ్
జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి బయలుదేరిన పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చి వేయడమేంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఇడుపులపాయలో హైవే వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి బయలుదేరిన పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వాహనాలను అడ్డుకోవడంతో కాలినడకనే ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటం గ్రామంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
పోలీసుల అనుమతి...
అయితే తాను కాలినడకనే గ్రామానికి వెళతానని పవన్ కల్యాణ్ చెప్పడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆయన ఇప్పటం గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేసిన ఘటనలో బాధితులను పరామర్శించడానికి పవన్ అక్కడకు వెళ్లారు.
Next Story

