Sat Mar 28 2026 04:55:37 GMT+0530 (India Standard Time)
కిందపడిపోయిన పవన్.. ఫ్యాన్ దెబ్బకు
నరసాపురం బహిరంగ సభకు వస్తున్న పవన్ కల్యాణ్ కు చేదు అనుభవం ఎదురయింది.

నరసాపురం బహిరంగ సభకు వస్తున్న పవన్ కల్యాణ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఆయన పర్యటనకు వెళుతున్న సమయంలో రావులపాలెం ఈతకోట వద్ద ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈతకోట గ్రామంలో పవన్ కల్యాణ్ తన వాహనాన్ని ఆపేసి అభిమానులకు అభివాదం చేసేందుకు కారు టాపు పైకి ఎక్కారు.
ఊహించని విధంగా....
అయితే ఊహించని విధంగా ఒక అభిమాని వచ్చి ఆయనను కౌగిలించుకునే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డులను తోసి ఆయన రావడంతో పవన్ కల్యాణ కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పవన్ కల్యాణ్ ను పైకి లేపారు. అభిమాని అత్యుత్సాహం కారణంగా పవన్ కల్యాణ్ కిందపడిపోవడంతో చుట్టూ ఉన్న అభిమానులు ఒకింత సేపు ఆందోళనకు గురయ్యారు.
Next Story

