Thu Apr 09 2026 15:50:10 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ విషయంలోనే ఎందుకింత రివర్స్?
పవన్ కల్యాణ్ ఆలోచనలను కాపు సామాజికవర్గం నేతలు సరిగా అర్థం చేసుకోవడం లేదంటున్నారు

పవన్ కల్యాణ్ ఆలోచనలను కాపు సామాజికవర్గం నేతలు సరిగా అర్థం చేసుకోవడం లేదంటున్నారు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అందరూ కట్టుబడి ఉండాలి. ఇది ఏపీ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ని కన్న బిడ్డలు.. సొంత అల్లుడు కలిసి ఎన్టీఆర్ ని పక్కన పెట్టి టీడీపీని తాము తీసుకుంటే ఒక్క నందమూరి అభిమాని కానీ.. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ.. ఒక్క కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కానీ చంద్రబాబు, బాలకృష్ణని ప్రశ్నించలేదు. పైగా అందరూ కలిసికట్టుగా ఆనాటి నుండి ఈనాటి వరకు మద్దతు ఇస్తూ చంద్రబాబుని ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసుకోగలిగారు.
జగన్ ఎన్ని చెప్పినా...
అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టగానే బొత్స సత్యనారాయణ రోజా తమ్మినేని సీతారాం ఆనం రామనారాయణరెడ్డి లాంటి చాలామంది నాయకులు జగన్ వ్యక్తిగతంగా తిట్టారు. అలాంటి వాళ్లందర్నీ జగన్ పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు మంత్రి పదవులు ఇచ్చారు. " నిన్ను మీ నాన్నని దారుణంగా తిట్టిన వాళ్లని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వడం ఏంటయ్యా..? అంటూ ఒక వైసీపీ కార్యకర్త కానీ వైఎస్సార్ అభిమానులు కానీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కానీ ఒక్కరు కూడా జగన్ ను ప్రశ్నించలేదు. " మా నాన్నని అనిల్ అంబానీ చంపించాడు " అని చెప్పి అదే అంబానీ ని ఇంటికి పిలిచి బిరియాని పెట్టి రాజ్యసభ సీటు ఇస్తే కార్యకర్తలు అందరూ కలిసి చప్పట్లు కొట్టారని, జగన్ ఏం చేసినా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారని, ఒకసారి ప్రతిపక్షంలో ఇంకోసారి అధికార పక్షంలో కూర్చోబెట్టారని కొందరు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.
పవన్ విషయంలో మాత్రం...
అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ చేసే వ్యక్తిగత తప్పులు వ్యక్తిగత వ్యవహారాలు ప్రజలు పట్టించుకోలేదు. రాజకీయంగా వాళ్ళ స్థితిని గమనించి ఓట్లు వేశారు. వాళ్ళ నాయకులు చేసే తప్పులు ప్రజల ముందుకు బహిరంగంగా వెళ్లకుండా ఆయా పార్టీల కార్యకర్తలు వాటిని మొదట్లోనే అణచివేశారు. కానీ జనసేన పార్టీ దగ్గరికి వచ్చేసరికి అంత రివర్స్ లో జరుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో పవన్ కల్యాణ్ కంటూ ఒక అవగాహన ఉండదా..? అని కొందరు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. రాజకీయ అవగాహన లేని కార్యకర్తలు శ్రేయోభిలాషులు మద్దతుదారులు ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ పొత్తులోకి వెళ్లారు. పదిహేనేళ్లు ఏళ్లు కూటమి కలిసి ఉండాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ చేసే మంచిని చూపించే పోస్టుల కంటే.. కళ్యాణ్ గారిని విమర్శించే పోస్టులు ఎక్కువగా వేయడం ఏంటని కొందరు ఫైర్ అవుతున్నారు. మంచి అయినా చెడు అయినా నాయకుడిని నమ్మి నడిచే వాడే కార్యకర్త. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పూర్తిగా నమ్మిన వాళ్లకే ఆయన వ్యూహాలు అర్థమవుతాయి. అని కామెంట్స్ వినపడుతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మెడలో జనసేన కండువా కప్పుకునేలా వ్యూహం వేశారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన లోకేష్ బాబు ఇప్పుడు "మా అన్న మా అన్న " అంటూ కళ్యాణ్ గారి వెనకే తిరుగుతున్నారంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Next Story

