Fri Mar 27 2026 10:30:17 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు పవన్...?
విశాఖలో జరిగిన సంఘటనపై పవన్ కల్యాణ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు ఆలోచన చేస్తున్నారు

విశాఖలో జరిగిన సంఘటనపై పవన్ కల్యాణ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆయనను కలసి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నోవాటెల్ లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. మరికాసేపట్లో ఆయన ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడ వెళ్లేందుకు...
గవర్నర్ బెంగళూరు నుంచి మధ్యాహ్నం విజయవాడకు చేరుకునే అవకాశముంది. అందువల్ల విజయవాడకు వెళ్లి గవర్నర్ కు పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. మూడు రోజుల నుంచి విశాఖలోనే ఉన్న పవన్ కల్యాణ్ నోవాటెల్ కే పరిమితమయ్యారు. జైలుకు వెళ్లిన 9 మంది జనసేన నేతలకు సంబంధించి పవన్ కల్యాణ్ న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం. హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాలని భావిస్తున్నారు.
Next Story

