Sat Apr 11 2026 15:12:56 GMT+0530 (India Standard Time)
Janasena : మున్సిపల్ ఎన్నికలలో పవన్ స్ట్రాటజీ ఇదేనా?
మున్సిపల్ ఎన్నికలు మరి కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి

మున్సిపల్ ఎన్నికలు మరి కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి. నిన్న మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొంత టీడీపీకి ఎన్నికలు అనుకూలంగా ఉండనున్నాయి. కానీ మిత్రపక్షమైన జనసేన, బీజేపీలు మాత్రం ఈ మున్సిపల్ ఎన్నికలు ఒకరకంగా సవాల్ అని చెప్పాలి. ఒకరకంగా జనసేనకు మున్సిపల్ ఎన్నికలు నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
పట్టణ ఎన్నికలు కావడంతో...
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో కొన్నింటిలో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. అదీ తూర్పు,పశ్చిమ గోదావరితో పాటు చిత్తూరు, తిరుపతి, రాజంపేట వంటి చోట్ల మాత్రమే అది ఎక్కువగా పోటీ చేసే అవకాశముంది.ఇప్పుడు గెలిచిన 21 శాసనసభ నియోజకవర్గాలలోని మున్సిపాలిటీల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో ఎక్కువ స్థానాలను తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ జనసేన పోటీ చేసే స్థానాలు పొత్తులో భాగంగా ఏవి వస్తాయన్నది చివర వరకూ తేలదు. కానీ ఈ ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రయిక్ రైట్ సాధించాలని పవన్ కల్యాణ్ ఖచ్చితంగా భావిస్తారు.
అసంతృప్తి ఉండటంతో...
కానీ అది అంత సులువు కాదు. మున్సిపల్ ఎన్నికలు అంటే పట్టణాలు. పట్టణాల్లో జనసేన పట్టు కొంత ఎక్కువగానే ఉంది. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే జనసేనకు క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. అయితే వారంతా ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో నేతలు సయితం పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అంత సానుకూలతగా లేరు. సాక్షాత్తూ కాపు నేతలే బహిరంగంగా పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుండటంతో వారి ఓటు బ్యాంకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎటువైపు మరలుతుందన్నది ఆసక్తికరంగా మారనుంది. మొత్తం మీద పవన్ కు మున్సిపల్ ఎన్నికలు ఒక ఛాలెంజ్ అని చెప్పాలి.
Next Story

