Fri Jan 17 2025 08:48:38 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఎంపీగా పోటీపై పవన్ ఆసక్తికర కామెంట్స్
ఎంపీ, ఎమ్మెల్యే పోటీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరుపెద్దలు తనను ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరారన్నారు
ఎంపీ, ఎమ్మెల్యే పోటీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీ పెద్దలు తనను ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరారని తెలిపారు. తనకు మనసులో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానో? లేదో? కొద్దిరోజుల్లోనే తెలుస్తుందని అన్నారు. బీజేపీకి సీట్లు ఇవ్వడం వల్లనే జనసేన ఎక్కువ సీట్లు నష్టపోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం చేసినందుకు నష్టపోవాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓడిపోతానని తెలిసి...
తాను గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోతానని తెలుసునని, అలాగే భీమవరం లో ప్రచారం పూర్తిచేసిన తర్వాత తాను అక్కడ కూడా గెలవలేనని తెలిసిందన్నారు. అయినా తాను బాధపడలేదన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు తనను తెలంగాణలోనూ, పిఠాపురంలో పోటీ చేయాలని కోరారని అన్నారన్నారు. ఈసారి తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీగా పోటీ చేసేదీ, లేనిదీ త్వరలోనే చెబుతానని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు.
Next Story