Wed Apr 01 2026 14:48:28 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ తగ్గింది అందుకేనట... కాపులు.. అర్థం చేసుకోండి బ్రదరూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులను పెద్దన్న పాత్ర పోషించాలన్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులను పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. దాని వెనక చాలా అర్థాలున్నాయి. అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కాపు పెద్దలకు, యువతకు అర్థం కావటం లేదు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైమాట్లాడుతున్నా కొందరు మాత్రం ఆయన మాటలకు పెడార్థాలు తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లు పదిహేనేళ్లు అనే మాట విని కాపు సామాజికవర్గం అయోమయంలో పడిందంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోసే బోయగా, కూలీగా మారారంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తుు-న్నారు.
ఎందుకు పెద్దన పాత్ర అంటే?
అయితే కాపులు ఎందుకు పెద్దన్న పాత్ర పోషించాలి అని పవన్ కళ్యాణ్ చెప్పాడంటే తిరిగి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, యువత ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడతారని, ఉపాధి అవకాశాలు తగ్గి ఇతర రాష్ట్రాలకు తరలి వెళతారన్నది కొందరు చెబుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేమని, విజన్ ఉన్న నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నది పవన్ కల్యాణ్ ఆలోచనట. కూటమిలోని పార్టీలన్నీ కలసి కట్టుగా ఉంటే జగన్ తిరిగి రారని చెబుతున్నా కాపు సామాజికవర్గంలో నెలకొన్న అసంతృప్తిని పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాలని కోరుతున్నారు.
నిరాశలో పడవద్దు...
ఎప్పుడైతే, పవన్ కళ్యాణ్ ఈ కూటమి 15 సంవత్సరాల పాటు నిలకడగా ఉంటుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అనటంతో, కాపులు మరీ ముఖ్యంగా మనవాడు ముఖ్యమంత్రి కావాలని బలంగా పనిచేసిన వారు నిరాశపడటం మొదలు పెట్టారు. , ఓటు చీలిక వలన, మరలా జగన్ వస్తే, ఇక రాష్ట్రం ఉండదు అని గ్రహించిన పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేశాడన్న విషయాన్ని కాపులు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. కేవ. కాపులను కనీసం 25% మంది నైనా ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తుల పరంగా ఎగువ స్థాయికి తీసుకు వెళ్లేలా చేయగలిగితేనే, నేటి కమ్మ, రెడ్ల మాదిరిగా భవిష్యత్తు రాజకీయాలను నడపగలరన్నది పవన్ ఆలోచనట. అందుకోసమే తాను ప్రస్తుతం తగ్గి, తన వారిని, తన పార్టీని మెల్ల మెల్లగా బలపరచుకుంటూ నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాడని, ఇది కాపు నేతలు, కాపు సామాజికవర్గ ఓటర్లు గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
Next Story

