Fri Mar 27 2026 08:56:00 GMT+0530 (India Standard Time)
నాలుక చీరేస్తామని మేం అనలేమా?
పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. పవన్ కల్యాణ్ ముసుగును తొలిగించేసుకున్నారని ఆయన అన్నారు

పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. పవన్ కల్యాణ్ ముసుగును తొలిగించేసుకున్నారని ఆయన అన్నారు. నాలుక చీరేస్తా సన్నాసి అని తాను అనలేనా? అని అన్నారు. కానీ తనకు సంస్కారం అడ్డు వస్తుందని ఆయన చెప్పారు. రేపటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతుందంటూ పవన్ చేసిన వ్యాఖలతో ఊహించవచ్చని ఆయన అన్నారు. 175 స్థానాల్లలో పోటీ చేస్తే తాము ప్యాకేజీ స్టార్ అని పిలవమని పేర్ని నాని చెప్పారు. ఈవెంట్ ఆర్గనైజేషన్ ను చంద్రబాబుకు అప్పగించారని పేర్ని నాని తెలిపారు. బీజేపీతో పవన్ కల్యాణ్ తెగదెంపులు చేసుకుంటానని పవన్ చెప్పకనే చెప్పినట్లయిందన్నారు.
ముందునుంచీ చెప్పిందే...
తమకు సంతోషంగానే ఉందని, తొలి నుంచి తాము చెబుతున్నట్లే జరుగుతుందని ఆయన తెలిపారు. నీకు ఒక కాలికి చెప్పు ఉందేమో కాని, మాకు రెండు కాళ్లకు చెప్పులు ఉన్నాయని నాని అన్నారు. చెప్పు తీసి సినిమా డైలాగులు చెబితే పవన్ నోటీ తీట తీరుతుందని, అంతే తప్ప అంతకు మించి జరిగేదేమీ ఉండదన్నారు. పవన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడిపోరని పేర్ని నాని అన్నారు. వైసీపీ కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
Next Story

