Pawan Kalyan : పవన్ కు శత్రువులు ఎవరో కాదు.. మిత్రులేనట
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుల్లోనే శత్రువులు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎదగలేని వారు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుల్లోనే శత్రువులు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎదగలేని వారు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తన సొంత నియోజకర్గం పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వెనక అదృశ్యశక్తి ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ స్పందిస్తారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో నియోజకవర్గంలో తక్కువగానే పర్యటిస్తుంటారు. తనకు బదులు ఫైవ్ మెన్ కమిటీని నియమించిన జనసేనాని టీడీపీ, జనసేన పార్టీలో గ్రూపు విభేదాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే తాజాగా ఉప్పాడ తీరంలో మత్స్యకారులు రోడ్డెక్కడం వెనక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సమస్య ఏంటంటే.. తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల వల్ల ఉప్పాడ తీరంలో మత్స్యసంపదను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

