పవన్ కళ్యాణ్ ఎమోషనల్: నా 2వ కొడుకుని ఎత్తుకోలేకపోతున్నాను!
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు, ఆరోగ్యంపై చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్!

Deputy CM Pawan Kalyan: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది అభిమానులు హాజరై, విజయవంతం చేశారు.
సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో, తన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినీ జీవితం సమయంలో నేను ఎంత బలంగా ఉండేవాడినో, ఇప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంత బలహీనపడ్డానో నాకు తెలియంది కాదు. గతంలో గుండెల మీద బండరాళ్లను పెట్టి పగలగొట్టించుకునేవాడిని. కానీ ఇప్పుడు నా రెండో కొడుకునే ఎత్తుకోలేని స్థితికి వచ్చాను. మీ అందరి అండతో మళ్లీ బలవంతుడిని అవుతాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇక, తన ప్రసంగంలో తెలుగు దేశం పార్టీ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు టీడీపీ అభిమానులను తీవ్రంగా అసహనానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య ఇప్పటికే జరుగుతున్న వాదనలకు ఆయన మాటలు మరింత మిన్ను పెట్టినట్లు అయ్యింది.
పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సినిమాల షూటింగ్‌కి వెళ్లడం లేదన్న విషయంపై కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆరోగ్య కారణంగానే ఆయన దూరంగా ఉంటున్నారని ఇప్పుడు స్పష్టమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

