Sat Mar 28 2026 09:38:00 GMT+0530 (India Standard Time)
వారికి అభినందనలు తెలిపిన పవన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడ్డారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారి బాధ్యత మరింత పెరిగిందన్నారు. స్థానిక సమస్యలను బలంగా ప్రస్తావించి, ప్రజల తరుపున నిలబడి పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
మరింత పట్టుదలతో....
జనసేనకు అండగా నిలిచిన ప్రజలకు కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాలతో మరింత పట్టుదలతో నేతలు పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. మరింత కసితో పనిచేయాలని కోరారు.
Next Story

