Mon Mar 02 2026 16:02:07 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ ఫార్ములా మారుస్తున్నారా? కాపుల కోరిక తీర్చేదిశగా అడుగులు పడనున్నాయా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారని సమాచారం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారని సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల పాటు ఉంటారని అనేకసార్లు ప్రకటించిన పవన్ కల్యాణ్ సొంత సామాజికవర్గం నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఇటు సామాజికవర్గం, అటు ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ తనకు రాజకీయ అనుభవం లేదని, అందుకు కొంత సమయం అవసరమని ఆయన భావిస్తున్నారంటున్నారు. అయితే కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సామాజికవర్గం ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారో తెలియని పరిస్థితి. అభిమానులయితే ఖచ్చితంగా పవన్ వెంటే నడుస్తారు.
చీలిక వస్తే...
కానీ ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజికవర్గం, బలమైన ఓటు బ్యాంకు అయిన కాపుల్లో చీలిక వస్తే అసలుకే ఎసరు వస్తుంది.అది వైసీపీ అధినేత జగన్ కు వరంగా మారుతుంది. ఆ విషయం పవన్ కు కూడా తెలుసు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే అన్నారంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల సమయానికి వ్యూహాన్ని రెడీ చేసే అవకాశముందని జనసేన నాయకులే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి జనంలోకి వెళ్లే కంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా అంటూ ఎన్నికలకు వెళితే మరోసారి అదికారంలోకి వచ్చే వీలుందన్నఅంచనాలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ ను అధికారంలోకి రాకుండా చేయడానికి చంద్రబాబు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించక తప్పదు.
ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో...
అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో వచ్చే ఎన్నికలకు కూటమి వెళుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ ఉండేలా ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని జనసేన వ్యూహంగా ఉంది. ఇందుకు పవన్ కల్యాణ్ కు బీజేపీ కూడా సహకరించే అవకాశాలు లేకపోలేదు. సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకుని నడుస్తున్న పవన్ కల్యాణ్ పై మోదీ, షాలకు మంచి గురి ఉందంటారు. అందుకే ఈసారి ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెరో రెండున్నరేళ్ల సమయం ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలన్ననిర్ణయాన్నిఎన్నికలకు ముందే ప్రకటించే అవకాశముంది.
Next Story

