Fri Dec 05 2025 12:01:16 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ప్రయాగ్ రాజ్ లో పవన్ కల్యాణ్
ప్రయాగ్ రాజ్ కు పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనకు అక్కడి బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు

ప్రయాగ్ రాజ్ కు పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనకు అక్కడి బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్ రాజ్ కు చేరకున్నారు. ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో మహకుంభ మేళా సందర్భంగా కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు చేశారు.
మహా కుంభమేళాలో...
పితృదేవతలకు పూజలు నిర్వహించారు. 144 ఏళ్ల కు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు రావడం తన అదృష్టమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా పుణ్యస్నానం చేసి తరలించాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి, కుమారుడు అకీరానంద్ తో పాటు మిత్రుడు, దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
Next Story

