Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ యాక్షన్ ఇలా ఉంటుందా?
కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. అనేక ఆరోపణలు వస్తున్నా నాయకత్వాలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు

కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. అనేక ఆరోపణలు వస్తున్నా నాయకత్వాలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. గతంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలపై యువతులను వేధించిన ఆరోపణలు వచ్చాయి. తాజాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వస్తున్న ఆరోపణలతో కూటమి ప్రభుత్వం పరువు బజారున పడినట్లయింది. అందులో నిజానిజాలు ఏవైనా, వాస్తవాలు ఎలా ఉన్నా చూసే వారికి, వినే వారికి మాత్రం ఎమ్మెల్యేలపై ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడుతుంది. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ నాయకత్వం అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరొక ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చినా మందలించి వదిలేసింది. ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పవన్ కల్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కేవలం హెచ్చరించి వదిలేస్తారా? లేక పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాలి.

