Sun Mar 22 2026 08:54:47 GMT+0530 (India Standard Time)
జనసేన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన పవన్
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి చిట్టాలు తన వద్ద ఉందన్న పవన్ కల్యాణ్ ఎవరు ఏంటో తనకు తెలుసునని పవన్ కల్యాణ్ చెప్పారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఆదేశించారు.
అరవ శ్రీధర్ వ్యవహారంపై...
అనంతరం సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటకు వెళ్లిపోయారు. ఈరోజు సీకే కన్వెన్షన్ సెంటర్ లో జనసేన సర్వసభ్య సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి నేతలందరూ హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరయిన పవన్ కల్యాణ్ అరవ శ్రీధర్ వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ కు చెందిన ఛైర్మన్లు పాల్గొన్నారు.
Next Story

