Thu Mar 19 2026 15:40:11 GMT+0530 (India Standard Time)
హోటల్ మంజీరాలో నారా లోకేశ్, పవన్ కళ్యాణ్
రాజమండ్రిలోటీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు

రాజమండ్రిలోటీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. ఐదు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పొత్తు సమావేశం జరగనుండడం.. ఈ కీలక భేటీకి నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్రనేతలు హాజరవుతుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమన్వయ కమిటీ సమావేశం కోసం నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని హోటల్ మంజీరాకు చేరుకున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 12 మంది కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై చర్చించనున్నారు.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో నారా లోకేష్ సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ తో నిర్వహించే సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Next Story

