Thu Mar 26 2026 02:46:02 GMT+0530 (India Standard Time)
బెజవాడలో కేసీఆర్ ఫ్లెక్సీ కలకలం
భీమ్లా నాయక్ విడుదల సందర్బంగా పవన్ అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీని విజయవాడలో ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది

విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీలోనూ అభిమానులున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఏపీలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటించినే భీమ్లా నాయక్ విడుదల సందర్బంగా పవన్ అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీని విజయవాడలో ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతును తెలియజేసేందుకు పవన్ అభిమానులు కేసీఆర్ భారీ ఫ్లెక్సీని విజయవాడలో ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది.
సినిమాకు మద్దతుగా....
విజయవాడలోని కృష్ణలంక సమీపంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరో సినిమాకు తెలంగాణ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని, ఏపీ ప్రభుత్వం కక్ష కట్టి కావాలని సినిమాను తొక్కే ప్రయత్నం చేస్తుంని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, జనసేన నేత నాదెండ్ల మనోహార్, వంగవీటి రాధాకృష్ణ ఫొటోలు కూడా ఉండటం విశేషం. కాగా ఒక సామాజికవర్గం ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసి ఉండవచ్చని కొందరు ఆరోపిస్తున్నారు.
- Tags
- pawan kalyan
- kcr
Next Story

