Sun Mar 15 2026 23:24:50 GMT+0530 (India Standard Time)
రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన
రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. విమానసర్వీసు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరసనకు దిగారు.

రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. విమానసర్వీసు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరసనకు దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడకుండా ఫ్లైట్ ను రద్దు చేయడంపై విమానంలో ముందుగా బుక్ చేసుకున్న 45 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి విమానాశ్రయంలో...
వాస్తవానికి తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు ఈ ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో విమాన సర్వీసులను రద్దు చేశారు. తమకు ముందస్తు సమాచారం తెలియజెప్పకుండా విమానం రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.
Next Story

