Sat Dec 06 2025 07:51:43 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు
ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేస్తుంది.

ఈ నెల 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ సభ్యులకు బీమా రూ.5 లక్షలకు పెంచుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.గతంలో బీమా రాని 73 మంది కార్యకర్తలకు రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం చేశారు.
వంద రూపాయలకు...
సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలానే వందరూపాయలుగా నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వం ఇవ్వనున్నారు. సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సభ్యత్వం నమోదులో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

