Sun Mar 08 2026 06:15:35 GMT+0530 (India Standard Time)
Janasena : 24 మంది అభ్యర్థులకు నేడు బీఫారాల అందచేత
జనసేన పార్టీ అభ్యర్థులకు నేడు బీఫారాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అందచేయనున్నారు

జనసేన పార్టీ అభ్యర్థులకు నేడు బీఫారాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అందచేయనున్నారు. ఈరోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీఫారాలను అందచేస్తారు. ఈ మేరకు ఖరాయిన అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయానికి రావాలని కబురు పంపారు. రేపటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుండటంతో ఈరోజు అభ్యర్థులకు బీఫారాలు అందచేయాలని పవన్ నిర్ణయించారు.
24 మంది అభ్యర్థులకు...
జనసేన పార్టీ ఈసారి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. పోటీ చేయనున్న అభ్యర్థులందరూ ముహూర్తాలు చూసుకుని నామినేషన్ వేసుకునేందుకు వీలుగా ఈరోజే బీఫారాలు అందచేయాలని నిర్ణయించారు.
Next Story

