Sat Mar 28 2026 06:30:50 GMT+0530 (India Standard Time)
ఉద్యోగులను వంచించడమే
ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు

ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. అధికారానికి రాకముందు అలివికాని హామీలను ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని వదిలేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు.
హమీలు ఏమయ్యాయి?
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగానే సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏం చేసిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి వాటిలో కోత పెట్టడమేంటని నిలదీశారు. ఇది ఉద్యోగుల పట్ల మోసపూరితమైన చర్యగానే తాము అభిప్రాయపడుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Next Story

