జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ....
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా స్వాంతంత్య్రాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికి అందాలని ఆయన కోరుకున్నారు.