Tue Jan 20 2026 10:40:07 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసైనికులకు పవన్ బహిరంగ లేఖ
జనసేన నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ ముఖ్యనేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.

జనసేన నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ ముఖ్యనేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఎవరూ అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని లేఖలో సూచించారు. కూటమిలోని మూడు పార్టీలూ కలసికట్టుగా ముందుకు వెళుతున్నాయని, తాము అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.
ఎవరూ రియాక్ట్ కావద్దంటూ...
కొందరు కావాలని చేసే దుష్ప్రచారాలను నమ్మి వాటిపై స్పందించవద్దని పవన్ కల్యాణ్ కోరారు. సోషల్ మీడియాలోవస్తున్న వార్తలపై స్పందించవద్దని ఆదేశించారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వాటిని నమ్మి వెంటనే పోస్ట్ చేయవద్దని కూడా తెలిపారు. అంతేకాదు అటువంటి విషయాలపై బహిరంగంగా చర్చించవద్దని కూడా పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
Next Story

