Thu Jan 29 2026 07:58:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మహానాడు సందర్భంగా చంద్రబాబు ట్వీట్ ఏంటంటే?
మహానాడు సందర్భంగా కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

మహానాడు సందర్భంగా కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమన్న ఆయన ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి.. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యమని అన్నారు.ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం.. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామన్న చంద్రబాబు తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది.. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రభుత్వం ఏర్పాటయ్యాక...
ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టామన్న చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా కార్యకర్తలకు తెలిపారు.
Next Story

