Mon Mar 23 2026 11:33:53 GMT+0530 (India Standard Time)
నేడు త్రిసభ్య కమిటీ విచారణ
నేడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పార్టి నియమించిన కమిటీ విచారణ జరపనుంది

నేడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పార్టి నియమించిన కమిటీ విచారణ జరపనుంది. ఈరోజు విచారణ కమిటీ ఎదుటకు హాజరు కావాలని అరవ శ్రీధర్ ను ఆదేశించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసం చేశారంటూ ఒక మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన త్రిసభ్య కమిటీని నియమించింది.
అరవ శ్రీధర్ వ్యవహారంపై...
ఈరోజు పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో పర్యటించనుంది. అయితే ఇప్పటి వరకూ అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరవుతారా? లేక హాజరు కారా? అన్నది చూడాలి. అయితే ఆయన హాజరుతో సంబంధం లేకుండా నేడు రైల్వే కోడూరులో ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారించనుంది.
Next Story

