Mon Mar 16 2026 00:50:35 GMT+0530 (India Standard Time)
నేడు విచారణకు వస్తారా?
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు సీఐడీ ఎదుటకు విచారణకు హాజరు కావాల్సి ఉంది

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు సీఐడీ ఎదుటకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరవుతారా? లేదా? అన్నది అనుమానంగా ఉంది. గతంలో ఉన్న కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా రఘురామ కృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా, పండగ వేళ రాలేనని, 17వ తేదీన వస్తానని రఘురామ కృష్ణరాజు సీఐడీ అధికారులకు తెలియజేశారు.
న్యాయ నిపుణులతో....
అయితే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించారు. తాను రాజ్యంగాన్ని గౌరవిస్తానని, విచారణకు హాజరవుతానని మీడియా సమావేశంలో చెప్పిన రఘురామ కృష్ణరాజు ఈరోజు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

