Sun Mar 08 2026 00:32:56 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి అన్ని విషయాలూ వివరించా
తనపై హత్యకు కుట్ర జరిగిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.

తనపై హత్యకు కుట్ర జరిగిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు. కొందరికి జబ్బు చేస్తుందని, కానీ మా ముఖ్యమంత్రి డబ్బు చేసిందని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. సీఐడీ పోలీసులను విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఉపయోగిస్తుందని చెప్పారు.
సునీల్ కుమార్ పై...
సీఐడీ అధికారి సునీల్ కుమార్ పైన తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన గతంలోనూ తనపై కక్ష కట్టారని, మరోసారి నోటీసులు పంపారని రఘురామ కృష్ణరాజు అన్నారు. అన్ని విషయాలను తెలియజేస్తూ తాను ప్రధానికి లేఖ రాశానని చెప్పారు. త్వరలోనే ఆయన నుంచి సానుకూల స్పందన వస్తుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
Next Story

