Sat Mar 07 2026 18:43:26 GMT+0530 (India Standard Time)
Palnadu : నేటి నుంచే పల్నాడు జిల్లాలో వ్యాపారాలు బంద్
పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ మల్లికా గార్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ మల్లికా గార్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో నేటి నుంచి వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వ్యాపారులు తమకు సహకరించాలని మల్లికా గార్గ్ కోరారు.
ఐదో తేదీ సాయంత్రం వరకూ...
ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో పల్నాడు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి పల్నాడు జిల్లాలో ఐదో తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయాలని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. జిల్లా అంతటా 144వ సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
Next Story

