Wed Mar 18 2026 21:35:31 GMT+0530 (India Standard Time)
బొత్స కామెంట్స్ కు పయ్యావుల కౌంటర్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నాలుగో రాజధానిని తెచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శాసన రాజధాని మాత్రమేనని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకూ ఉంటుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీనికి అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే మూడు రాజధానులంటూ ప్రజలను వైసీపీ ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు.
నాలుగో రాజధాని....
ఇప్పుడు తాజాగా నాలుగో రాజధానిని హైదరాబాద్ ను తెరపైకి బొత్స సత్యనారాయణ తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉపయోపడేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ఏపీని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతున్నారని, రాజధాని అమరావతిని వైసీపీ నేతలు అంగీకరించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన అంశాలపై జగన్ ఎదుకు మౌనంగా ఉన్నారని పయ్యావుల కేశవ్ నిలదీశారు.
Next Story

