Thu Dec 18 2025 13:41:09 GMT+0000 (Coordinated Universal Time)
జనంతో కలసి జనసేన ఉద్యమం
రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై జనసేన ఆందోళన చేపడుతుందని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై జనసేన ఆందోళన చేపడుతుందని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం మోపుతూనే ఉన్నారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన వారు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికే భయపడిపోతున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
నవరత్నాలు మోసమే....
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో ప్రతిదీ మోసమేనని నాదెండ్ల మనోహర్ అన్నారు. విద్యుత్తు ఛార్జీల విషయంలో శ్లాబ్ లను ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. ప్రజలతో కలసి జనసేన విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై ఉద్యమం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్తు కోతలు ఎనిమిది గంటలకు అమలవుతున్నాయని పేర్కొన్నారు. జగన్ కు ప్రజలు బాధలేవీ పట్టడం లేదని ఆయన అన్నారు.
Next Story

