Sun Mar 08 2026 00:14:23 GMT+0530 (India Standard Time)
ఎప్పుడైనా విశాఖకు వెళతాం
పరిపాలన రాజధానిగా విశాఖ ఎప్పుడైనా అవ్వొచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

పరిపాలన రాజధానిగా విశాఖ ఎప్పుడైనా అవ్వొచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి మహాయజ్ఞంలా కొనసాగుతుందనన్నారు. కొన్ని విషశక్తులు కుట్ర పన్ను తున్నాయని తెలిపారు. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.
అందరి ఆమోదంతోనే...
అందరి ఆమోదంతోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన జరుగుతుందని ఆయన చెప్పారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏ ప్రభుత్వంలో ఎంతమందికి, ఎవరికి మేలు జరిగిందో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
Next Story

