మన పగడపు దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది
విశాఖ తీరంలోని పూడిమడక, రుషికొండ, మంగమారిపేట, విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద అరుదైన పగడపు దిబ్బలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.

విశాఖ తీరంలోని పూడిమడక, రుషికొండ, మంగమారిపేట, విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద అరుదైన పగడపు దిబ్బలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్కైవ్స్ లో ప్రచురితమైన ‘డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ కమ్యూనిటీ ఫ్రం విశాఖపట్నం కోస్ట్, ఏపీ’ అనే ఆర్టికల్లో వివరాలను పంచుకున్నారు. ఇప్పటివరకు పగడపు దిబ్బలు భారతదేశంలో లక్షద్విప్, అండమాన్–నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్లకే పరిమితమని భావించేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరంలో కూడా పగడపు దిబ్బలు ఉన్నాయని తేలింది. మొత్తం 15 ప్రదేశాల్లో అధ్యయనం చేశారు. చింతపల్లి వద్ద 12 రకాల పగడపు దిబ్బలు, రుషికొండ వద్ద 6, పూడిమడక వద్ద 5, మంగమారిపేట వద్ద 3 రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు గుర్తించారు. పూడిమడక వద్ద ఉన్న పగడపు దిబ్బల్లో కొంతభాగం తీసి మరో చోటికి తరలించి పెంచేందుకూ అవకాశం ఉందని తేలింది.