Fri Dec 05 2025 16:24:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో పలువరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో పలువరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు సమయంలో కడప నుంచి బదిలీ అయిన హర్షవర్ధన్ రాజు కు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి ఎస్పీ గా హర్షవర్ధన్ రాజు నియామకం చేశారు. తిరుపతి తొక్కిసలాట లో బదిలీ ఆయిన సుబ్బా రాయుడు కు రెడ్ శాండల్ యాంటి టాస్క్ఫోర్స్ ఎస్పీ గా నియమించారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కర్నూలు ఎస్పీ గా బదిలీ చేశారు. కాకినాడ ఎస్పీ గా బిందు మాధవ్ సెంట్రల్ డెప్యుటేషన్ పూర్తి చేసుకుని వెయిటింగ్ లో ఉన్న అదనపు డైరెక్టర్ జనరల్ మధు సూధన్ రెడ్డి కి కీలక పోస్టింగ్ ఇచ్చారు.
కడప ఎస్సీగా...
శాంతిభద్రతల అదనపు డీజీ గా మధు సూదన్ రెడ్డి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా అదనపు డీజీ అర్ కే మీనా, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ ఐ జీ గా సీ హెచ్ శ్రీకాంత్, వెయిటింగ్ లో ఉన్న ఐజీ పాలరాజు కు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. వెయిటింగ్ లో ఉన్న ఐజీ జయలక్ష్మి కి ఏసీబీ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశఆరు. ఐజీ గా పదోన్నతి పొందిన రాజకుమారి ని ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ గా కొనసాగించారు. దీపికా పాటిల్ కు కర్నూలు బెటాలియన్ ఎస్పీ గా బదిలీచేశారు. కడప జిల్లా నూతన ఎస్పీ గా ఈజీ అశోక్ కుమార్ ను నియామించారు.
Next Story

