Tue Dec 16 2025 02:26:20 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుర్గగుడికి నేడు వచ్చారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుర్గగుడికి నేడు వచ్చారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీమణి భువనేశ్వరితో కలసి చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రికి వచ్చారు. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు...
చంద్రబాబు దంపతులకు ఆలయ పండితులు, అధికారులు వేద ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం చంద్రబాబు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలను అందచేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
Next Story

