Wed Jan 22 2025 15:27:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. హాజరు కానున్న సీఎం జగన్
నేటి రాత్రి ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్,
ఒంటిమిట్ట : శ్రీరామనవమిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి రాత్రి ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్, ఏపీ మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం జగన్ కడపకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా.. రాములవారి కల్యాణ ఏర్పాట్లను టిటిడి ఈఓ జవహర్ రెడ్డి పరిశీలించారు. వసతుల కల్పన, అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీకి సంబంధించి కలెక్టర్ విజయరామరావు, ఎస్పీ అన్బురాజన్, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్ వర్మ, ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు.
Next Story