Sun Feb 01 2026 20:01:28 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి నేటి నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు.

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి నేటి నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2023 - 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.
నేటి నుంచి...
మే 17వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
Next Story

