Sun Mar 15 2026 11:33:49 GMT+0530 (India Standard Time)
Magunta : త్వరలో టీడీపీలోకి.. నేను పోటీ చేయను... తేల్చిచెప్పిన మాగుంట
త్వరలో తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు

త్వరలో తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అయితే అధినాయకత్వం సూచన మేరకు తాము ఎప్పుడు చేరేదీ నిర్ణయించుకుంటామని చెప్పారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని కూడా మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టత ఇచ్చారు.
మరో రెండు రోజులలో...
మరో రెండు రోజుల్లో తమ కుటుంబం టీడీపీలో చేరనుందని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఒంగోలులోని ఆయన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి వైసీపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
Next Story

