Tue Mar 17 2026 07:31:29 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ కుటుంబం
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీలో చేరారు

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కూడా పార్టీలో చేరారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.
మరికొందరు కూడా...
తాను మాత్రం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన చెంచు గరటయ్య, కృష్ణచైతన్యలు కూడా టీడీపీలో చేరారు. వీరందరినీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Next Story

