Wed Jan 07 2026 17:27:10 GMT+0000 (Coordinated Universal Time)
నిపుణులు వచ్చిన తర్వాతే మంటలు అదుపులోకి
కోనసీమలో చెలరేగిన మంటలను అదుపులోకి వచ్చేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మోరిలో గ్యాస్ బావిలో చెలరేగిన భారీ మంటలను ఆర్పేందుకు ముంబై, ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందాలు చేరుకుంటున్నాయని అధికారులు మంగళవారం తెలిపారు. సోమవారంతో పోలిస్తే మంటల తీవ్రత తగ్గిందని చెప్పారు. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో మోరి, ఇరుసుమండ గ్రామాల సమీపంలోని ONGCకి చెందిన మోరి–5 గ్యాస్ బావిలో లీక్ కారణంగా భారీ జెట్ ఫైర్ చెలరేగింది. మంటలు సుమారు 20 మీటర్ల ఎత్తు, 25 మీటర్ల వెడల్పుతో ఎగసిపడ్డాయి.
ఓఎన్జీసీ కాదు.. కాంట్రాక్టర్ నిర్వహణలో...
ఈ గ్యాస్ బావిని ఓఎన్జీసీ నేరుగా నిర్వహించడం లేదని, కాంట్రాక్టర్ గా అహ్మదాబాద్‌కు చెందిన డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉష్ణోగ్రత తగ్గేందుకు నీటితో వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశామని, మంటలు ఇంకా కొనసాగుతున్నాయని నిపుణుల బృందాలు వచ్చాక పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటారని కోనసీమ జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి చెప్పారు. చుట్టుపక్కల చెట్లపై నీటిని పిచికారీ చేస్తూ చల్లబరుస్తున్నామని, మంటల తీవ్రత సోమవారంతో పోలిస్తే తగ్గిందని తెలిపారు.
Next Story

