Fri Dec 05 2025 17:38:04 GMT+0000 (Coordinated Universal Time)
Machavaram: విజయవాడలో మరో విషాదం
కొద్దిరోజుల కిందట విజయవాడలో కొండచరియలు విరిగిపడి

కొద్దిరోజుల కిందట విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. మాచవరం వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి. మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
Next Story

